మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల పై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేతో పాటు బీజేపీ నేతలు నలిన్ కుమార్, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ లు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని అమిత్ షా స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.తమ వ్యాఖ్యలను ముగ్గురు నేతలు వెనక్కి తీసుకుని క్షమాపణలు కోరిన విషయాన్ని షా గుర్తుచేశారు.
ఈ ముగ్గురు నేతల వ్యాఖ్యలను బీజేపీ క్రమశిక్షణా కమిటీకి పంపామని చెప్పారు. కమిటీ ముగ్గురు నేతల నుంచి వివరణ కోరుతుందనీ, అనంతరం 10 రోజుల్లోగా తుది నివేదిక ఇస్తుందని తెలిపారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.నాథూరాం గాడ్సే దేశభక్తుడని బీజేపీ నేత, భోపాల్ లోక్ సభ సీటు అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ దెబ్బకొడుతున్నాడు: దేవినేని ఉమ