telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తమిళనాడు : .. స్థానిక ఎన్నికలలో .. సత్తాచాటిన ట్రాన్స్ జెండర్….

trans gender win in local elections in TN

రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ విజయం సాధించారు. దీనికి సంబంధించిన పత్రాన్ని ఎన్నికల అధికారులు అందచేశారు. స్థానిక సంస్థ పదవికి ఎన్నికైన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. డీఎంకే పార్టీకి సంబంధించిన టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. నమ్మక్కల్ జిల్లాల్లోని తిరుచెంగోడ్ యూనియన్ నుంచి పోటీ చేసి 947 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. 21 నుంచి 22 సంవత్సరాల వయస్సు కలిగిన యువతులు, 79 నుంచి 82 సంవత్సరాలున్న మహిళలు, శానిటరీ వర్కర్‌లు గెలుపొందిన వారిలో ఉండడం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ట్రాన్స్ జెండర్ల గొంతులు వినిపించే విధంగా ముందుకు రావాలని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ పిలుపునివ్వడంతో రియా అప్లై చేసుకున్నారు. రియాకు అభినందనలు తెలియచేస్తున్నట్లు, డీఎంకే తూతుకుడి ఎంపీ, ఉమెన్ వింగ్ సెక్రటరీ కనిమోజి తెలిపారు.

12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ట్రాన్స్ జెండర్ విషయాన్ని 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు తెలియచేసింది. ప్రస్తుతం రియా వయస్సు 30 ఏళ్లు. తన విన్నపాన్ని పేరెంట్స్ అంగీకరించారని, సమాజం కూడా లింగమార్పిడిని అంగీకిరించిందన్నారు. ట్రాన్స్ జెండర్ పర్సన్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. బోర్డు ఏర్పాటు చేసే సమయంలో ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్నారు. విజయం సాధించడం పట్ల రియా సంతోషం వ్యక్తం చేశారు. లింగమార్పిడిని గుర్తించి..టికెట్ ఇచ్చినందుకు డిఎంకేకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్ల, కొత్త అధ్యాయం మొదలైందన్నారు రియా.

Related posts