నీవు ఒప్పుకున్నా లేకున్నా
నిజం నిప్పు లాంటిది..
గజం భూమికోసం
బంధాలను బలి చేస్తున్నారు.
వజ్రం లాంటి మనుషులను వదులుకుంటున్నారు..
ఒరేయ్,
నీవు ఎన్నాళ్ళు బ్రతుకుతావో చెప్పగలవా?
నీవు ఇష్టపడే డబ్బు నీతో ఎంతకాలం వుంటుందో
చెప్పగలవా.. ?
నీతో రానిది నీదికానిదే కదా?
దానికై ఆరాటంతో
నిన్ను నీవు కోల్పోతున్నావు..ఇది గమనించక
నా వాళ్ళకంటు పాపాన్ని మూటగట్టుకొని,
నీ వాళ్ళనుకునే వాళ్ళకోసం దాచిపెడుతు,
వారిని సోమరులను చేసి
వారిని మనుషులుగా మనగలగకుండా
మనీ పర్సుగా మార్చేశావు..
నీవు చేయు ఈ తప్పు
క్షమించరానిది..
నీవు ఒప్పుకున్నా లేకున్నా
ఇది నిప్పులాంటి నిజం..
నిజం చూడాలనుకుంటే
నీ అంతరంగంలోకి తొంగి చూడు
నిన్ను కన్న వాళ్ళు చేసినదే నీవు చేస్తున్నా వు..
నీవు ఎంత సౌక్యమో, నిను కన్న వాళ్ళు ఎంత కుశలమో
కాస్త కూలకషంగా ఆలోచించు..
మూడు కాలాల ముచ్చటలో నీవు ఎచట వున్నావో
నిను తరచి చూచిన నీకే బోధపడుతుంది…
మనిషిగా పుట్టి మనిషిగా మరణించకు
ఋషిగా మారి మహర్షిగా నిలిచిపోవాలి…