telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సొంత నియోజక వర్గంపై .. జగన్ వరాల జల్లులు..

jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వేముల మండలం నల్లచెరువుపల్లిలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడం. పులివెందుల నియోజకవర్గంలో 11 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పులివెందుల ఏరియా ఆసుపత్రికి, వేంపల్లి సిహెచ్‌సీకి 30 కోట్లతో మౌలిక సౌకర్యాల కల్పన. మున్సిపాలిటీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎస్టీపీకి రూ. 50 కోట్లతో డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు.

పులివెందులలో రూ. 17.65 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం. జేఎన్‌టీయూ కొత్త లెక్చరర్‌ కాంప్లెక్స్‌, నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి రూ. 10 కోట్ల నిధులు మంజూరు.. పులివెందుల మార్కెట్‌యార్డ్‌లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరు.. సింహాద్రిపురం, వేంపల్లి పాలిటెక్నిక్‌ కాలేజ్‌లకు రూ. 15 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. పులివెందుల నియోజకవర్గంలో కొత్తగా 7 గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు సన్నాహాలు చేయాలని సూచించారు. సుమారు రూ. 10 కోట్లతో అభివృద్ది ప్రతిపాదనలు శిల్పారామానికి సిద్దం చేయాలని చెపారు. ఈక్పోతే మిని శిల్పారామం ఏర్పాటకు వేంపల్లిలో భూమి గుర్తింపు, నిర్మాణ ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలు జారి చేశారు.

Related posts