అందాల చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. కాజల్ ఇటీవలే కోమలి, రణరంగం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో “కోమలి” చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్లో ” ముంబై సగ” అనే చిత్రంలో జాన్ అబ్రహంతో రొమాన్స్ చేయనుందట. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించనున్నారని సమాచారం. క ఆమె నటించిన “పారిస్ పారిస్” కూడా విజయం సాధిస్తుందని కాజల్ ధీమాగా ఉంది. మరోవైపు కమల్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “భారతీయుడు-2″లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జతకట్టనుంది కాజల్. “కాల్ సెంటర్” అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె మంచులక్ష్మి హోస్ట్‌గా చేస్తోన్న ‘ఫిట్ అప్ విత్ స్టార్స్’ అనే ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ షో ఆన్ లైన్ స్ట్రీమింగ్ సైట్ వూట్‌లోప్రసారం అవుతోంది. ఈ రియాలిటీషో పాల్గొన్న కాజల్ తన నట జీవితంలో ఎదుర్కోన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా…మీరూ ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో ఏ నటుడితో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారు అని హోస్ట్ మంచు లక్ష్మి అడగగా.. కాజల్ రెస్పాండ్ అవుతూ.. ‘మామూలుగా ప్రేమించిన వ్యక్తి కళ్లలోకి చూసి మనం ప్రేమను తెలియపరుస్తాం అని చెబుతూ.. తాను హిందీలో 2016లో నటించిన ‘దో లఫ్జోన్ కే కహనీ’ చిత్రం గురించి మాట్లాడింది. కాజల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అంధురాలి పాత్రను పోషించాను. నా ప్రియుడిగా రణదీప్ హుడా నటించాడు. మా ఇద్దరి మధ్య ప్రేమను చూపించడానికి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించింది చిత్ర బృందం. అయితే ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బందిపడ్డానని చెప్పింది కాజల్. ఆమె మాట్లాడుతూ.. నాకు తెలియని ఒక వ్యక్తితో అలాంటి రొమాంటిక్ సీన్స్‌లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది అని పేర్కోంది.
previous post