telugu navyamedia
ట్రెండింగ్

ఉత్తర తమిళనాడుకు .. వాయుగుండం..రెడ్ అలర్ట్ : వాతావరణ శాఖ

high alert in tamilanadu

అకాల వర్షాలకు తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వంతులో చిన్న మార్పు, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. వాయుగుండం బలపడి తుపానుగా మారి ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉందని అన్నారు.

దీని ప్రభావం వల్ల ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఏప్రిల్ 30, మే 1న అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారుల అంచనా. ఈ నేపథ్యంలో ఉత్తర తమిళనాడులో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Related posts