telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

సెకండ్ వేవ్ ప్రదర్శించిన అలసత్వం థర్డ్ వేవ్ లో వద్దు…

sanitizer mask corona

మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో కరోనా కేసులు రోజుకు నాలుగు లక్షలకు పైగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ విధించిన తర్వాత కరోనా మొదటి వేవ్ తగ్గుముఖం పట్టిన తరువాత ప్రదర్శించిన అలసత్వం, కరోనా నిబంధనలు పాటించకపోవడం వలనే సెకండ్ వేవ్ ఇంట ఉధృతంగా మారింది.  సెకండ్ వేవ్ లో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  మరణాల రేటు కూడా అధికంగా ఉన్నది.  ఇక థర్డ్ వేవ్ కూడా తప్పదని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది.  థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, సెకండ్ వేవ్ సమయంలో ప్రదర్శించిన అలసత్వం ప్రదర్శిస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని, ఇప్పటికే హెచ్చరించారు నిపుణులు.  కరోనా నిబంధనలు కఠినంగా పాటించడం, మాస్క్ ను సరైన పద్దతిలో ధరించడం, వ్యాక్సిన్ వేయించుకోవడం వంటివి చేయడం ద్వారా కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.  

Related posts