telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ ప్రధానికి షాక్ తగ్గాలనుందా…?

Imran

నయా పాకిస్తాన్ పేరుతో ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు.  ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి.  దీంతో ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారు.  అప్పులు తీర్చేందుకు, వడ్డీలు కట్టేందుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తున్నారు.  ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.  అటు సైన్యం సైతం ఇమ్రాన్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి.  ఇక జనరల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంలో ఏదోలా చేసి నెగ్గిన ఇమ్రాన్ ఖాన్, తన పదవిని వదిలేందుకు సిద్ధంగా లేరు.  అయితే, ఇమ్రాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిని ఉక్కుపాదంతో అణగదొక్కిన సైన్యం కూడా ఇప్పుడు ఇమ్రాన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతోంది.  అటు నవాజ్ షరీఫ్, జర్దారీ పార్టీలు ఒక్కటయ్యాయి.  ఎలాగైనా ఇమ్రాన్ ను గద్దె దించాలని చూస్తున్నాయి.  కొత్తగా దేశంలోకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.  సంపద ఎలా సృష్టించాలో తెలియడం లేదు.  దీంతో అప్పులు తెచ్చుకోవడం ఒక్కటే ఇమ్రాన్ సర్కార్ కు మార్గంగా మారింది. 

Related posts