telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మా ఆయన చిన్నపిల్లాడు… రాజశేఖర్ వ్యాఖ్యలపై జీవిత క్షమాపణలు

Jeevitha-Rajasekhar

‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాబాసగా మారిన విషయం తెలిసిందే. మాలో ఉన్న విబేధాల గురించి రాజశేఖర్‌ ఎత్తిచూపటంతో చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్‌ తీరును ఖండిస్తూ ప్రొటోకాల్‌ పాటించకుండా మాట్లాడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జరిగిన దానికి జీవిత క్షమాపణ చెపుతూ… రాజశేఖర్‌ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, ఆయన ఏది దాచుకోడు, మనసుకి ఏది అనిపిస్తే అది అనేస్తాడు. కోపం కూడా ఎక్కువే ఆయనకు. టోటల్‌గా రాజశేఖర్‌ మోర్‌దాన్‌ ఎ కిడ్‌ అని జీవిత అన్నారు. “మా”ని అంతరం కలిసి గొప్ప స్థాయికి తీసుకు పోవాలని, మాలో ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు. చిరంజీతోపాటు వేదిక మీదున్న పెద్దలు ముందుండి నడిపిస్తే తాము కష్టపడి పనిచేయడానికి సిద్దమన్నారు. మాలో కార్యవర్గ సభ్యురాలినైనప్పటినుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, చిరంజీవి కూడా ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారని జీవిత అన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు సహజమేనని అవన్నీ పక్కనపెట్టి సినిమా పరిశ్రమకోసం కష్టపడదామని జీవిత కోరారు. దీంతో అప్పటిదాకా కాస్త వాడి వేడిగా ఉన్న సమావేశం చల్లబడింది. తమ వ్యక్తిగత జీవితాల గురించి కామెంట్ చేయడానికి ఎవరికీ అర్హత లేదని.. తామేమీ మీ ఇంట్లో ఇంట్లో కట్టేసే కుక్కలమో.. గేదెలమో కాదని జీవితా రాజశేఖర్ స్పష్టం చేశారు. సమస్యలుంటే అసోసియేషన్‌లో పరిష్కరించుకుందామన్నారు. ఎవరూ ఎవరిని మోసం చేయలేదన్నారు. గొడవలు, తగాదాలు రావడం సహజమన్నారు. దాచుకోవాల్సిన అవసరం లేదు.. దాచుకోవడానికి ఏమీ లేదని జీవిత స్పష్టం చేశారు.

Related posts