తెలంగాణ ప్రభుత్వంపై ప్రొఫెసర్ కోదండరాం మరోసారి ఫైర్ అయ్యారు. సత్తుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాజ్యాంగం విరుద్ధంగా, అన్యాయంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులారా ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసిందని ఫైర్ అయ్యారు. నియంత్రిత సాగు పేరుతో సన్న రకాల పత్తిని తీసుకువచ్చి రైతులు విపరీతంగా నష్టపోవటానికి ముఖ్యమంత్రి కేసిఆర్ కారణమని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, నిరుద్యోగానికి కారణమైందన్నారు. పూర్తిగా అధికారాన్ని స్వార్థం కోసం వాడుకున్న వైనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామని పేర్కొన్నారు. ఒక కుటుంబం తన అవసరాల కోసం, కమీషన్లు దండుకోవడానికి కోసం అధికారాన్ని వాడుకుంటుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఘోరంగా మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు నిజం తెలుసుకోవాలని తెలిపారు.
previous post
next post

