కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు జూన్ నెల కోటా కింద రేషన్‌కార్డుదారుల కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. జులై నెలలో అయిదు కిలోల వంతున పంపిణీ చేస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కష్టకాలంలో పేదలు అర్ధాకలితో బాధపడరాదన్న ఉద్దేశంతో బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 87.43 లక్షల మంది రేషన్‌కార్డుదారులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులకూ బియ్యం అందజేస్తున్నాం. తద్వారా సుమారు 2.80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. చౌకధరల దుకాణాల సిబ్బందికి టీకాల ప్రక్రియ సాగుతుండటంతో 1వ తేదీ కాకుండా 5 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించనున్నారు. జూన్‌లో అదనపు కోటా సహా సుమారు 4.6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయనున్నారు. కేంద్ర నిబంధనల మేరకు 53.56 లక్షల కార్డుదారులకే బియ్యం అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించటంతో మరో 33.86 లక్షల మంది అర్హులయ్యారు. అందరికీ ఉచితంగానే బియ్యం పంపిణీ చేస్తాం’ అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
previous post
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అధ్వానపు చదువు: జయప్రకాశ్