telugu navyamedia
రాజకీయ

శ్రీరంగనాథస్వామి ఆలయంలో కేసీఆర్ దంప‌తులు ప్రత్యేక పూజలు

తమిళనాడులో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేసీఆర్ దంపతులకు అధికారులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు.

అనంత‌రం కుటుంబసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి… రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ దంపతులు ఆలయానికి చెందిన ఆండాల్ అనే గజరాజు కు పండ్లు అందజేసి.. గజరాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.

స్వామి వారి ద‌ర్శ‌న అనంత‌రం మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ. శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే… ఎంతో బలం, ధైర్యం చేకూరినట్లుగా అనిపిస్తుంటుంది.

శ్రీరంగం ఆల‌య ద‌ర్శ‌నానికి రావ‌డం ఇది రెండోసారి అని తెలిపారు. డీఎంకే ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకోవ‌డం ఇదే తొలిసారి అని చెప్పారు.

తమిళనాడు ప్రభుత్వం గుడిని చాలా బాగా అభివృద్ధి చేసింది. తమిళనాడు సీఎం నాకు మంచి మిత్రుడు. ఎన్నికల్లో తను చాలా అద్భుతమైన విజయం సాధించారు. ​రేపు సాయంత్రం త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌తో స‌మావేశం అవుతాన‌ని కేసీఆర్ తెలిపారు.

Related posts