దివంగత నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. కెరీర్ మొదట్లో లవర్ బాయ్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ వరుస హిట్లను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఆయన. ఆయన బయోపిక్‌కి రంగం సిద్ధమవుతున్నట్టు కొన్నాళ్ళ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్‌ని వెండితెరకి పరిచయం చేసిన తేజ, బయోపిక్‌ని తెరకెక్కిస్తాడని అన్నారు. కాని అది రూమర్ అని తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా ఉదయకిరణ్ బయోపిక్ మళ్లీ వార్తలలోకి వచ్చింది. ఓ షార్ట్ ఫిలిం మేకర్ సందీప్ కిషన్‌తో ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయాలని భావించగా, ఆయన రీసెంట్‌గా సందీప్‌ని కలిసి స్టోరీ వినిపించాడట. దీనికి ఇంప్రెస్ అయిన సందీప్… బయోపిక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇందులో ఉదయ్ కిరణ్ జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు, జయాపజయాలతో పాటు ఉదయ్ కిరణ్ పడిన ఇబ్బందులు, మానసిక డిప్రెషన్స్ తదితర అంశాలు సినిమాలో చూపించనున్నాడట. పెద్ద ఫ్యామిలీకి అల్లుడిగా కాబోయి కొద్దిలో పెళ్లి క్యాన్సిల్ కావడం, చనిపోయే చివరి రోజులలో ఉదయ్ మానసికంగా ఎలాంటి బాధ అనుభవించాడు అనే అంశాలు కూడా సినిమాలో చూపించనున్నాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
previous post