గత వారం రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే… భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కెసిఆర్ పిలుపుకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే.. మేఘా సంస్థ, తమిళనాడు, ఢిల్లీ ప్రభుత్వాలు విరాళాలు ఇచ్చారు. వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయక చర్యలకు అండగా ఉండేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు వారు తెలిపారు. తాజాగా వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ స్థైతం ముందుకు వచ్చింది. తాజాగా..భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమైన హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మై హోమ్ సంస్థ రూ. 5 కోట్ల విరాళం ప్రకటించింది. హైదరాబాద్ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మైహోమ్ సంస్థ భరోసానిచ్చింది.
previous post
next post