telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ “ఫైటర్” టైటిల్ చేంజ్…!?

Puri

క్రేజీ స్టార్ విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఛార్మీ కౌర్‌, కరణ్‌ జోహార్‌తో కలిసి పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ మారిందని టాక్‌. ఈ చిత్రానికి తొలుత ‘ఫైటర్‌’ టైటిల్‌ ఖాయం చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం తదితర భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండు భాషల్లో ఈ టైటిల్‌ దొరకలేదట. కొన్ని అనివార్య కారణాల వలన సినిమాలో హీరో పేరు ‘లైగర్‌’ను టైటిల్‌గా ఖరారు చేశారట. ‘ఫైటర్‌’ బన్‌గయా ‘లైగర్‌’ (మగ సింహానికి, ఆడ పులికి పుట్టిన బిడ్డను లైగర్‌ అంటారు). ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ యాక్షన్‌ రోల్‌ చేస్తున్నారు. పాత్ర కోసం మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు.

Related posts