telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కీర్తి లీన్‌ లుక్ కు నెగటివ్‌ రెస్పాన్స్

Keerthy-Suresh

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు… అయితే కీర్తీ సురేశ్‌ సన్నబడితే మాత్రం ఫ్యాన్స్‌ తట్టుకోలేకపోతున్నారు. కీర్తి ఇలా తయారైందేంటి, ఫేస్‌లో ఛార్మ్‌ లేదు, గ్లో తగ్గిపోయింది అని కామెంట్ చేస్తున్నారు. కీర్తీ నువ్వు త్వరగా బరువు పెరిగిపో అని రిక్వెస్ట్‌ చేస్తున్నారు అభిమానులు. కీర్తీ సురేశ్‌కి హోమ్లీ హీరోయిన్‌ ఇమేజ్‌ ఉంది. ఈ ఇమేజ్‌కి తగ్గట్టుగానే కీర్తీ కొంచెం బొద్దుగానే కనిపిస్తుంది. అయితే “మిస్‌ ఇండియా’ సినిమా కోసం చాలావరకు బరువు తగ్గింది కీర్తి. లీన్‌ లుక్‌తో జనాలముందుకొచ్చింది. కానీ ఈ లీన్‌ లుక్‌ అస్సలు సెట్‌ కాలేదని కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ లుక్‌కి నెగటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కీర్తీ సన్నబడితే అస్సలు బాలేదని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఈ లుక్‌లో కీర్తీ పేషెంట్‌లా కనిపిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. కీర్తీ సురేశ్ ఇప్పుడు “రంగ్‌దే’ సినిమాతో పాటు, మహేశ్ బాబుతో “సర్కారు వారి పాట’కి సైన్‌ చేసింది. అయితే “రంగ్‌దే’లో కూడా సన్నగానే కనిపిస్తోంది కీర్తీ. మరి “సర్కారు వారి పాట’ సినిమాకైనా కీర్తీ బొద్దుగా మారుతుందా, లేక ఈ లీన్‌ లుక్‌తోనే ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్‌ చేస్తుందా అన్నది చూడాలి. ఇక కీర్తి తదుపరి సినిమాలు ‘గుడ్‍లక్‍ సఖి’, ‘రంగ్‍ దే’ కూడా ఓటిటి ద్వారా విడుదల అవుతాయని ప్రచారం జరుగుతోంది.

Related posts