telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ లో “ఇస్మార్ట్ శంకర్”… హీరో ఎవరంటే ?

Ismart-Shankar

గత కొంతకాలంగా బాలీవుడ్ దర్శకనిర్మాతల చూపు తెలుగు సినిమాలపై పడింది. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను బాలీవుడ్ రీమేక్ చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే “అర్జున్ రెడ్డి” బాలీవుడ్ లో రీమేక్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో ఈ సినిమాలో నటించిన షాహిద్ కపూర్ రేంజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఈ సినిమాలో షాహిద్ కి జంటగా నటించిన కియారా అద్వాని ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఇలా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న వాటిలో ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీబ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇంకో తెలుగు సినిమాని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కూడా రీమేక్ హిందీలో రీమేక్ కాబోతోందట. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 75-80 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి సెన్షేషన్ ని క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా రెట్టింపు లాభాలను సొంతం చేసుకుంది. మొత్తానికి చాలాకాలం తరువాత “ఇస్మార్ట్ శంకర్” పూరికి, హీరో రామ్ కి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మరి రణబీర్ కపూర్ కి ఈ సినిమా ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.

Related posts