telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ దోపిడీ దొంగల మీద కూడా “సర్జికల్ స్ట్రైక్”

బండి సంజయ్‌ సర్జికల్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని కోట్లు, సీట్ల కోసం మతిస్థితిమితం కోల్పోయారని ఎద్దేవా చేశారు కేటీఆర్‌. బండి సంజయ్‌ వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి సమర్థిస్తారా ? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌. ఇలా ఓట్ల కోసం మతాలను రెచ్చగొట్టడం దారుణమని ఫైర్‌ అయ్యారు. ఓట్ల కోసం ఇంత దిగజారుతారా బీజేపీ నాయకులని మండిపడ్డారు. అయితే… కేటీఆర్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ రివర్స్‌ కౌంటర్‌ వేశాడు. “అక్రమ చొరబాటుదార్ల పై ” సర్జికల్ స్ట్రైక్ ” తప్పనిసరి. విదేశీ చొరబాటుదార్ల ఓట్లతో ఎన్నికల్లో గెలవడం కేటీఆర్‌ కంటున్న పగటికల. కేవలం విదేశీ విద్రోహుల మీద కాదు…తెలంగాణ దోపిడీ దొంగల మీద కూడా “సర్జికల్ స్ట్రైక్”అవినీతి,కుటుంబ స్వామ్యం మీద కూడా “సర్జికల్ స్ట్రైక్”కాంట్రాక్టుల వేల కోట్ల దోపిడి పై కూడా ” సర్జికల్ స్ట్రైక్ “కాంట్రాక్టుల నుంచి రియల్ ఎస్టేట్ ఎత్తిపోతల మీద కూడా ” సర్జికల్ స్ట్రైక్ “మీ మిత్రుల డ్రగ్ దందా మీద..రియల్ గ్రాబింగ్ మీద ” సర్జికల్ స్ట్రైక్ “చివరగా ఒక విన్నపం…మద్యంతాగి ప్రభుత్వాన్ని నడపడం రాష్ట్రానికి ప్రమాదకరం. చొరబాటుదార్ల ఓట్లతో గెలవాలని చూడడం దేశానికి ప్రమాదకరం.” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌.

Related posts