నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు ఇకలేరని ట్విట్టర్ ద్వారా తెలిపారు. “మా తాతగారు పెన్మత్స సాంబశివరాజుగారు ఈ రోజు మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడాయన. సివిల్ సప్లయ్ మినిస్టర్, ట్రాన్స్‌ఫోర్ట్, సుగర్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ వంటి ఎన్నో పదవులను ఆయన అలంకరించారు. ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో పోరాడిన గొప్ప నాయకుడు” అని కృష్ణుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (87) అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడుగా ఆయన గుర్తింపు పొందారు. అలాగే మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా కూడా ఈయనను చెప్పుకుంటారు.
My grand father Penumatsa Samba siva raju garu passed away today.He is one of the senior most leaders in Ap 9 times MLA..Civil supplies minster, Transport ,sugar industries,Large scale industries minister.Great leader who always cared about peoples welfare.@YSRCParty@ysjagan pic.twitter.com/1JXouMcsuH
— Krishnudu✨ (@iamkrishnudu) August 10, 2020
నా దెబ్బకు విజయ్ మరో రెండేళ్ల వరకు సినిమా చేయడు : రష్మిక మందన్న