telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మనకి తొడలు, బొడ్డు అంటే అబ్సెషన్ కదా… పూజాహెగ్డేపై కత్తి విమర్శనాస్త్రాలు

Pooja-Hegde

దక్షణాది ప్రేక్షకులపై పూజా హెగ్డే చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో మూవీ క్రిటిక్ మహేష్ కత్తి ఆమెకు క్యారెక్టర్‌పై ఓపెన్ కామెంట్ చేస్తూ ఫేస్‌ బుక్‌లో పోస్ట్ పెట్టాడు. ‘అవును… పూజా హెగ్డే చెప్పింది నిజమే కదా! మనకి తొడలు, బొడ్డు అంటే అబ్సెషన్ కదా!! దానికి సిగ్గెందుకూ? పూజా హెగ్డేని మాత్రం ఆవిడ భీభత్సమైన నటన చూసా మన దర్శకులు రిపీట్ చేస్తోంది? ఎదో చూడ్డానికి బొంబాయి మోడల్ లా ఉంటుంది. రూపవతి పైగా అనుకూలవతి మరియు గగనజఘనవతి అనేకదా?!?’ అంటూ ఆమెపై క్యారెక్టర్‌పై సంచలన పోస్ట్‌ని షేర్ చేశాడు. అయితే మహేష్ కత్తి కామెంట్‌పై బీవీఎస్ రవి స్పందిస్తూ వాట్ ది హెల్ అనుకూలవతి అని ప్రశ్నించగా.. హీరోలకు దర్శకులకు అనుగుణంగా నడిచే హీరోయిన్ ని అనుకూలవతి అనడం కరెక్టే కదా గురువు గారూ! అంటూ సమర్ధించుకున్నాడు కత్తి మహేష్.

అవును…పూజా హెగ్డే చెప్పింది నిజమే కదా! మనకి తొడలు,బొడ్డు అంటే అబ్సెషన్ కదా!! దానికి సిగ్గెందుకూ? పూజా హెగ్డేని మాత్రం…

Posted by Mahesh Kathi on Friday, 6 November 2020

ఇక మరో నెటిజన్ అనుకూలవతి అంటే ఏంటి?? అని ప్రశ్నించగా.. ‘పూజా హెగ్డేని సైన్ చేసే బడ్జెట్ ఉంటే చెప్పు. అప్పుడు అర్ధం చెబుతా!’ అంటూ ద్వందార్థంతో కూడా రిప్లై ఇచ్చారు కత్తి మహేష్. ఇంతకీ రూపవతి, అనుకూలవతి ఓకే.. ఇంతకీ గగనజఘనవతి అంటే ‘గగన జఘనంలో గగనం అంటే ఆకాశం..ఆకాశం అంటే శూన్యం ..శూన్యం అంటే లేనిది అని …అంటే నడుము లేనిది అని కవి భావన’ అంటూ కత్తి మహేష్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

Related posts