telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అహ్మద్ పటేల్ మృతి : ప్రధాని మోడీ, సోనియా గాంధీ సంతాపం

కాంగ్రెస్‌ పార్టీ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కరోనా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే.. గురుగావ్‌లోని వేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం 3:30 గంటలకు అహ్మద్‌ పటేల్‌ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్‌ పటేల్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.  అయితే.. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, సోనియా గాంధీ సంతాపం తెలిపారు. నమ్మకమైన సహోద్యోగి, స్నేహితుడిని తాను కోల్పోయానని సోనియా పేర్కొన్నారు. ఆయన జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీకి అంకిత చేశారని.. అంకిత భావం,  కర్తవ్యం పట్ల నిబద్ధత, ఔదార్యం ఆయనకున్న అరుదైన లక్షణాలని సోనియా గాంధీ తెలిపారు. ఆహ్మద్‌ పటేల్‌ మృతిపై మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి చేసిన కృషి చిరస్మరణీయమని.. ఆయన చాలా కాలం పాటు ప్రజా సేవలో తన జీవితాన్ని గడిపారని మోడీ ట్వీట్‌ చేశారు. పటేల్‌ లాంటి నాయకుడి దేశం కోల్పోవడం చాలా బాధకరమన్నారు మోడీ. ​​​​​​​

Related posts