తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే…ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇక 24 గంటల్లో నలుగురు కరోనాతో మృతిచెందారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,66,042 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 2,53,715 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో తెలంగాణ రాష్త్రంలో మొత్తం 1441 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 93.07 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 95.36 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 10,886 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 47,593 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 52,48,807 కు చేరుకుంది.
previous post