telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీలో లక్షల ఫామ్-7 దరఖాస్తులు..! 15 శాతమే అసలైనవి..

election notifivation by 12th said ec

ఇటీవల ఏపీలో తమ ఓట్లను తొలగించాలని లక్షల మంది నుండి దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదొక ఆన్ లైన్ స్కాం గా కూడా అనుమానించారు. ప్రస్తుతం అదే నిజం అయ్యింది. ఆ దాఖలైన దరఖాస్తుల్లో 85 శాతం నకిలీ దరఖాస్తులేనని ఏపీ ఎన్నికల సంఘం తేల్చేసింది. ఓట్లను తొలగించాలని తమకు 9.5 లక్షల ఫామ్-7 దరఖాస్తులు అందాయని వెల్లడించింది. వాటిలో కేవలం 1.41 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించామనీ, నకిలీ ఓట్లను తొలగించామని పేర్కొంది.

ec got issue with huge requests on form 7వీటిలో సంగం ఓట్లు గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఏపీలో 3.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల పర్వం ముగిసేసరికి తుదిజాబితాలో ఓటర్ల సంఖ్య 3.93 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. త్వరలోనే తుది జాబితాను రాజకీయ పార్టీలకు అందిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది.

Related posts