టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఏపీ ప్రజలకు ఉపయోగపడలేదని విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న ద్వజమెత్తారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత చంద్రబాబుదని వెంకన్న తెలిపారు.
విజయసాయిరెడ్డికి ఉన్న ప్రధాన అర్హత కాళ్లమీద పడటమేనని చురకలంటించారు.అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన అవినీతికి 16 నెలలు జైలులో కూర్చున్న ఘనత విజయసాయిరెడ్డిదని ఎద్దేవా చేశారు. విమర్శించడానికి నోరు ఒక్కటే ఉంటే సరిపోదనీ, అర్హత కూడా ఉండాలని విజయసాయిరెడ్డికి హితవు పలికారు. గుర్తింపు కోసం అడుక్కునేవాడు అథమస్థాయి బిచ్చగాడనీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో పేర్కొన్నారు.
చంద్రయాన్-2 వైఫల్యంపై పాక్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు