కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు. గత జూన్‌లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా సిద్ధూకు విద్యుత్ శాఖ మంత్రి పదవిని అప్పగించారు. ఈ శాఖ పై కొద్దికాలంగా సిద్ధూ అసంతృప్తిగా ఉన్నారు. అంతే కాకుండా ఇంతవరకూ పదవీ బాధ్యతలు కూడా చేపట్టలేదు.
కాగా, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తన రాజీనామా విషయాన్ని పంచుకున్నట్టు సిద్ధూ ఇవాళ ఓ ట్వీట్‌లో షేర్ చేశారు. రాహుల్ గాంధీకి 2019 జూన్ 10న తన రాజీనామా లేఖను అందజేశానని ఆయన పేర్కొన్నారు.సిద్ధూ తన రాజీనామా లేఖను పంజాబ్ ముఖ్యమంత్రి అమీరీందర్ సింగ్‌కు కాకుండా నేరుగా రాహుల్ గాంధీకి ఇచ్చారు. అయితే తన రాజీనామా విషయాన్నిట్వీట్ చేసిన 30 నిమిషాల తర్వాత సిద్ధూ మరో ట్వీట్ చేస్తూ ముఖ్యమంత్రికి కూడా తన రాజీనామా లేఖను పంపుతున్నట్టు తెలిపారు.
వైసీపీ నేతలు కలలు కంటున్నారు: సోమిరెడ్డి