telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

లీవ్ లేటర్లలో కెల్లా .. స్టార్ లెటర్ .. సెలవు ఇచ్చిన పంతులికి .. ఓ ఏసుకోవాల్సిందే..

school student leave letter viral

కొన్ని సంఘటనలు చుస్తే అవి చేసేవారి .. తెలివి అనుకోవాలో.. అమాయకత్వం అనుకోవాలో తెలిసిచ్చావదు. అంత గొప్పగా ఉంటాయి మరి ఆ పనులు. తాజాగా, ఓ పాఠశాల విద్యార్థి రాసిన లీవ్ లెటర్ కూడా అటువంటిదే; ఇక అది చదివి సెలవు ఇచ్చేసిన పంతులుగారిని మెచ్చుకోవాల్సిందే.. తప్పదు, పరిస్థితి అటువంటిది. విషయానికి వస్తే.. లీవ్‌కు కారణాలు రకరకాలుగా రాస్తారు. ఎందుకంటే సరైన కారణం లేంది లీవ్‌కు స్కూల్ యజమాన్యం పర్మిషన్ ఇవ్వదు కదా. ఈ లీవ్ విషయంలో ఓ విచిత్ర ఘటనచోటుచేసుకుంది.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వున్న ఓ ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థి ఒకరు’నేను చనిపోయా,ఆఫ్ డే లీవ్ కావాలి’అని లీవ్ లెటర్‌లో రాశాడు.ఇంతకంటే చిత్రం,విచిత్రం ఏమింటంటే, ఏమి ఆలోచించకుండా ఆ ప్రిన్సిపాల్ అతడి లీవ్ లెటర్‌ ఆమోదించి, విద్యార్థికి సెలవు ఇచ్చాడు. ఆ విధ్యార్ధి రాసిన లెటర్ ఈ విధంగా వుంది. గౌరవ నీయులైన ప్రిన్సిపాల్, ఈ రోజు ఉదయం 10 గంటలకు నేను చనిపోయాను.కావునా దయచేసి ఆఫ్ డే లీవ్ ఇవ్వగలరు .. అని అందులో రాశాడు.

వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే ఆ యువకుడు తన అమ్మమ్మ చనిపోయిందని రాయల్సి ఉండగా, ఆమె స్థానంలో తానే చనిపోయానని రాశాడు.ఇది సరిగ్గా గమనించని ప్రిన్సిపాల్ లేఖను పూర్తిగా చదవకుండానే అందులో వున్న మ్యాటర్ తెలియకుండానే అతడు చెప్పిన నోటి మాట విని సంతకం చేశాడు.చెప్పడం కరక్ట్‌గానే చెప్పాడు కాని రాయడంలోనే పొరబాటు జరిగింది. ఆ లెటర్ స్కూల్ సిబ్బందికి చిక్కింది. దీంతో దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌గా మారడంతో ఆ స్కూలు యజమాన్యం వివరణ ఇవ్వక తప్పలేదు. లీవ్ లెటర్‌ను పూర్తిగా చదవకపోవడం వల్ల ఆ లివ్ లేటర్ కాస్త డెత్ లెటర్‌గా మారింది.చిన్న ఎమరు పాటు వల్ల ఈ తప్పిదం జరిగిందని స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. చూసారుగా పిల్లల వల్ల జరిగే మంచి, చెడు పనులు.అందుకే వారు చేసిన, చేస్తున్న పనులేంటో ముందువెనకా గమనించాలి లేకుంటే అప్పుడప్పుడు ఇలానే జరుగుతుందంటున్నారు ఈ వార్త విన్న వాళ్లు నవ్వుకుంటూ!!

Related posts