telugu navyamedia
రాజకీయ

కోరోనా వ‌ల్ల త‌ల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్ల‌ల‌కు కేంద్రం సాయం..

*క‌రోనా త‌ల్లిదండ్రులను కోల్పోయిన పిల్ల‌ల‌కు ఆర్థిక‌సాయం
*పిల్ల‌ల పేరిట 10ల‌క్ష‌లు చెప్పున జ‌మా..

కొవిడ్​ కారణంగా తల్లిందడ్రుల‌ను సంరక్షకులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకాన్ని ప్రారంభించారు.

Modi releases benefits under PM Cares for children who lost parents to Covid-19 | Latest News India - Hindustan Times

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. . కొవిడ్​ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తనకు తెలుసునని.. వారి కోసమే ఈ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని చేపట్టామన్నారు.

కరోనాతో చనిపోయిన వాళ్ల బిడ్డలకు తోడ్పాటుగా, వాళ్ల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకే పీఎం కేర్స్‌ ఫండ్‌ ఇప్పుడు ఉపయోగపడుతోందని అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 

దేశంలోని ప్రతిఒక్కరు వారితో ఉన్నారనే భరోసాను పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ కల్పిస్తోంది. అనాథలైన చిన్నారులు పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కువ డబ్బు అవసరమవుతుంద‌ని అన్నారు.

Afternoon brief: Modi releases benefits under PM CARES for children | Latest News India - Hindustan Times

2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో.. తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లినో తండ్రినో కోల్పోయిన పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని అర్హులు. వారికి ఈ పథకం కింద స్కాలర్‌షిప్పులు, పీఎం కేర్స్‌ పాస్‌ పుస్తకాలు, ఆయుష్మాన్‌ భారత్‌ వైద్యబీమా కార్డు అందిస్తున్నారు.

18-23 ఏళ్ల వయసుండి ఉన్నత విద్య చదివే వారికి ప్రతి నెలా స్టైపండ్ ఇస్తారు. 23 ఏళ్లు వచ్చాక రూ.10 లక్షలను అందిస్తాం. అంతేకాదు ఆయుష్మాన్ హెల్త్ కార్డుల తో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందుతుంది. అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అర్హులైన పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ పేరుతో ఒక పోర్టల్​ ప్రారంభించారు. పేర్ల నమోదుతో పాటు దరఖాస్తుల ఆమోద ప్రక్రియ, సాయం అందించడం వరకు అన్నీ ఈ పోర్టల్‌ నుంచే సాగుతాయి.
ఇప్పటికే ప్రతి రాష్ట్రంలోనూ లబ్ధిదారులను గుర్తించారు. వారికి ఇవాళ్టి నుంచే పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

Related posts