భారతీయ సమాజానికి మహిళలే వెన్నెముక అనీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కోలకతాలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. కలకత్తా శ్రద్ధానంద పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ మహిళల సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందంటూ దీదీ ట్వీట్ చేశారు. ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. కొత్త భారతదేశం, ఐక్య భారతదేశం బలమైన భారతదేశాన్ని సృష్టించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని పార్టీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించిన తరువాత పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్: సుజనా చౌదరి