telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆక్సిజన్ ఉత్పత్తి పాలసీ ప్రారంభించిన సిఎం జగన్

cm Jagan tirumala

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 14 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  ఏపీలో ప్రతి రోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి, ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పాలసీ 2021-22ను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం ఉన్న 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 700 మెట్రిక్ టన్నులకు పెంచటమే ఉద్దేశ్యంగా ఈ పాలసీని ప్రారంభించారు. రాష్ట్రంలో 50 పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పాలసీ రూపుదిద్దుకుంటోంది. ముందుకు వచ్చే ఆక్సిజన్ ఉత్పత్తిదారులకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. పెట్టుబడిలో 30 శాతం వరకు సబ్సిడీ కూడా ఇవ్వనుంది. అలాగే విద్యుత్ యూనిట్ కు రెండు రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి అమలులో ఉన్నట్లు పరిగణలోకి తీసుకోనుంది. ఇక ఈ ఆక్సిజన్ పాలసీ ఏడాది వరకు అమలలో ఉండనుంది. 

Related posts