telugu navyamedia
తెలంగాణ వార్తలు

నన్ను చంపేందుకు రేవంత్‌ రెడ్డి కుట్ర -మంత్రి మల్లారెడ్డి

*నన్ను చంపేందుకు రేవంత్‌ రెడ్డి కుట్ర..
*కాంగ్రెస్ లోనే రేవంత్ కు గౌర‌వం లేదు..
*రేవంత్ 8ఏళ్ళుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు..
*రేవంత్ కుట్ర‌ల‌ను బ‌య‌ట‌పెడ‌తాం..
*రేవంత్ రెడ్డిని జైలుకు పంపిస్తా..

నన్ను హత్య చేసేందుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి కుట్ర చేశార‌ని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు . హైద‌రాబాద్ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ..రేవంత్ కుట్రలు బయటకు తీసి జైలుకు పంపుతాన‌ని అన్నారు.

రెడ్డిల ముసుగులో ఒక 100 మందిని సభకు పంపి వెనక కూర్చొబెట్టి తనను హత్య చేసేలా ప్రణాళిక రూపొందించారని సంచలన ఆరోపణ చేశారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నా ఆ నేరం తనపైకి రాదనే ఉద్దేశంతో ఈ సమయంలో దాడి చేయించాడని అన్నారు.

రేవంత్ రెడ్డి 8 ఏళ్ళుగా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అన్నారు. రేవంత్ కుట్రలు బయటకు తీసి జైలుకు పంపుతాన‌ని అన్నారు. రేవంత్‌ అసలు బాగోతం మూడో ఎపిసోడ్‌లో వివరిస్తాను అని అన్నారు.. ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని, దేనికైనా సిద్దమేనని చెప్పారు.

త‌న‌పై దాడి చేసిన వారికి విడిచిపెట్ట‌మ‌ని, చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు.

అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేందుకు కేసీఆర్‌ కంకణబద్ధులై ఉన్నారని చెప్పారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని తెరాస హామీ ఇచ్చిందన్నారు. అయితే రెండేళ్లలో కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని నేను వివరిస్తుండానే.. కొందరు వ్యతిరేకంగా నినాదాలు చేశారని చెప్పారు

Related posts