telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈట‌లకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన బుద్ది చెప్పాలి : మంత్రి గంగుల

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప‌రిగెల‌తో పోల్చిన ఈట‌ల రాజేంద‌ర్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన బుద్ది చెప్పాల‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ‌, పౌర‌స‌ర‌ఫ‌రాలశాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో మిల్లర్లు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి గంగుల హామీనిచ్చారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కేవలం యాసంగి సీజన్‌లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ సేకరించిన‌ట్లు చెప్పారు. కేసీఆర్‌ను ఎదురిస్తే ముఖ్యమంత్రి పదవి వస్తుందనే దురాశతో ఈటెల రాజేంద‌ర్‌ చేసిన కుట్రలు నీచమైనవన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్దిని గాలికొదిలేసి స్వలాభం కోసం రాజకీయాల్ని వాడుకోవడం హేయమని విమర్శించారు. ఈట‌ల హయాంలో హుజురాబాద్ అన్ని రంగాల్లో వెనుకకు నెట్టేయబడిందన్నారు. ప్రధాన రహదారులన్నీ గుంతల‌మయం అయ్యాయని.. ఈ దురవస్థ తొలిగిపోవాలంటే టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు రైస్ మిల్లర్లు మద్దతుగా నిలవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకొని హుజురాబాద్‌ను మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపు నిచ్చారు. ధాన్యాన్ని నిల్వ చేయడంతో పాటు మిల్లింగ్ చేయడంలో సహకరిస్తున్న రైస్ మిల్లర్లకు మంత్రి గంగుల అభినందనలు చెప్పారు.

Related posts