telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఈ రోజైన రైతులు-కేంద్రం చర్చలు కొలిక్కొస్తాయా?

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు.  పంజాబ్ తో సహా అనేక రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ చేరుకొని ఆందోళనలు చేస్తున్నారు.  ఢిల్లీ శివార్లలో వేలాది రైతులు చేరుకున్నారు.  అయితే, పోలీసులు ప్రస్తుతం వారిని ఢిల్లీలోకి రాకుండా అడ్డుకుంటున్నారు.  ఢిల్లీకి చేరుకునే అయిదు మార్గాలను  మూసేశారు.  ఇక ఇదిలా ఉంటె ఈరోజు కేంద్రం రైతులతో మరోసారి చర్చలు జరుపుతున్నది.  డిసెంబర్ 1 వ తేదీన ఓమారు చర్చలు జరిపింది. కానీ, ఆ చర్చలు ఫలించలేదు.  ఈరోజు ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ భేటీ అయ్యారు.  ఈ సమావేశం అనంతరం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు సమావేశం జరుపుతున్నారు.  ఈ సమావేశానికి 40 రైతు సంఘాలు హాజరవుతున్నాయి.  ఈరోజు జరిగే చర్చలతో రైతులు తమ ఆందోళనను విరమించుకుంటారని కేంద్రం భావిస్తోంది.  కొత్త చట్టాల ప్రకారం రైతులకు మద్దతు ధర లభించదని, వ్యవసాయంలో కార్పొరేషన్ వ్యవస్థ ప్రవేశిస్తే అన్నదాత మరింత దిగజారిపోతాడని రైతులు భయపడుతున్నారు.  వారి భయాలను పోగొట్టి, అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది.  మరి ఈరోజలు జరిగే చర్చలు సఫలం అవుతాయా లేదా అనేది చూడాలి మరి.

Related posts