telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జలదీక్షకు బ్రేక్‌..జగ్గారెడ్డి అరెస్టు

Jaggareddy gives clarity party change

పట్టణంలో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా తాగునీటి సమస్యలపై ఎంతగా పోరాడినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని ప్రభుత్వాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. తాగునీటి సమస్య కోసం నేటి నుంచి దీక్ష చేపడుతానని జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోలీసులు జగ్గారెడ్డిని అరెస్టు చేశారు.

గోదావరి జలాలను సంగారెడ్డి జిల్లాకు తరలించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న జగ్గారెడ్డి ఇందుకోసం దీక్ష చేస్తానని ప్రకటించారు. చెప్పినట్టే ఈ రోజు నుంచి జల దీక్ష చేపట్టనున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఇందులో భాగంగా ఈరోజు దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న జగ్గారెడ్డిని పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఆయనను కొండాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Related posts