telugu navyamedia
తెలంగాణ వార్తలు

మెట్రో స్టేషన్‌లో ఓ యువతి రెచ్చిపోయి టిక్ టాక్..

మెట్రో స్టేషన్‌ లో కొంత‌మంది యువ‌తీ యువ‌కులు రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్‌ని కేంద్రంగా చేసుకొని టిక్ టాక్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌ నగరంలోని మెట్రో స్టేషన్‌లో  స్నేహితుల‌తో క‌లిసి ఓ యువతి ఫ్లాట్‌ఫామ్‌పై చేసిన టిక్ టాక్ వీడియో వైరల్‌ గా మారింది.

మెట్రో స్టేషన్‌లో నిముషం కూడా ఎవరినీ ఉండనివ్వని అధికారులు ఈ యువతిని ఎలా అనుమతించారనే ప్రశ్నలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Dance Reel Gone Wrong! Hyderabad Girl Spotted Tapping Her Foot Inside Metro  and On Station, Viral Video Lead Officials To Take Action Against the Young  Woman - Fresh Headline

దీంతో ఆ వీడియో కాస్తా మెట్రో అధికారుల దృష్టికి చేరింది. వీడియోపై స్పందిస్తూ.. ఈ వీడియోను ఏ స్టేషన్‌లో చేశారో గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు వివరణ తెలిపారు.

Related posts