telugu navyamedia
సినిమా వార్తలు

రష్మికతో లిప్ లాక్ పై విజయ్ దేవరకొండ షాకింగ్ రిప్లై

Dear-Comrade

“డియర్ కామ్రేడ్” సినిమా ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తున్నారు. ఈ చిత్రం జూలై 26న విడుదల కాబోతుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ డైరెక్ట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. దీంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” ప్రమోషన్స్ కోసం బెంగుళూరులో మ్యూజిక్ ఫెస్టివల్ కు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మీడియా పలు విషయాలపై మాట్లాడాడు. ఓ మీడియా ప్రతినిధి రష్మికతో లిప్ లాక్ సీన్స్ గురించి అడగగా విజయ్ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. రష్మికతో లిప్ లాక్ పై విజయ్ స్పందిస్తూ … “నేను రష్మికని ముద్దు పెట్టుకోవడమో, రష్మిక నన్ను ముద్దు పెట్టుకోవడమో కాదు… బాబీ అనే పాత్ర లిల్లీ అనే పాత్రని ముద్దు పెట్టుకుంటుంది. సినీతారలు వెండి తెరపై నటిస్తున్నారు అని ప్రేక్షకులు మరచిపోయే ఏకైక దేశం ఇండియా. దానిని లిప్ లాక్ అని పిలవకూడదు. ముద్దు అని పిలవాలి. ముద్దు అనేది ఒక ఎమోషన్ అని విజయ్ తెలిపాడు. తన గురించి లిప్ లాక్ అనే పదం విన్నప్పుడు “what the f***’ అని అనిపిస్తుంది” అని విజయ్ దేవరకొండ అన్నారు.

Related posts