సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్‌లో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామా “డియర్ కామ్రేడ్”. “యు ఫైట్ ఫర్ వాట్ యు లవ్” ట్యాగ్ లైన్. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. సామాజిక బాధ్యత ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్రలో విజయ్ దేవరకొండ మెప్పించనున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. “డియర్ కామ్రేడ్” ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శృతి రామచంద్రన్, సుహాస్, చారు హాసన్, ఆనంద్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ శుక్రవారమే గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అన్ని భాషల్లో తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. “డియర్ కామ్రేడ్” సినిమాలో హీరోయిన్ రష్మికా మందన్న క్రికెటర్‌గా నటించింది. తాజాగా చిత్రం నుండి “గిర గిర గిర” అంటూ సాగే పాట టీజర్ విడుదల చేశారు. ఈ పాటకి రెహమాన్ లిరిక్స్ అందించగా, గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల పాటని ఆలపించారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే సాంగ్‌గా గిర గిర గిర ఉంటుందని తెలుస్తుండగా, ఈ పాట సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది. విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పాటతో పాటు మామ చూడొద్దురో అనే పాట టీజర్ కూడా విడుదల చేశారు. సెలబ్రేషన్ సాంగ్‌గా ఈ పాటని చిత్రీకరించారు.
పోలింగ్ కేంద్రంలో చిరు, బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..