telugu navyamedia
సినిమా వార్తలు

నాని “గ్యాంగ్ లీడర్” ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదే…!

Gang-Leader

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇది ఒక రివేంజ్ డ్రామా అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. మరోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధ‌మైపోయాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.28 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకుందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.20.90 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ది ఇండియా రూ.1.80 కోట్లు, ఓవర్సీస్ లో రూ.5.50 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.28.20 కోట్ల బిజినెస్ జరుపుకొంది.

ఏరియాల వారీగా…
నైజాం – రూ.8.00 కోట్లు
సీడెడ్ – రూ.3.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.2.50 కోట్లు
గుంటూరు – రూ.1.80 కోట్లు
ఈస్ట్ – రూ.1.60 కోట్లు
వెస్ట్ – రూ.1.20 కోట్లు
కృష్ణ – రూ.1.45 కోట్లు
నెల్లూరు – రూ.0.75 కోట్లు

Related posts