telugu navyamedia
సినిమా వార్తలు

పోలింగ్ కేంద్రంలో చిరు, బాల‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

‘మా’ ఎన్నికల పోలింగ్‌లో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్ది సేపట్లోనే..పోలింగ్ కేంద్రానికి సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ త‌దిత‌రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా.. మా ఎన్నికల గురించి సినీ తారలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. దురదృష్టవశాత్తు మా ఎన్నికల్లో పోటీ వాతావరణం నెలకొందని అన్నారు. ప్రతిసారీ ఇదే స్థాయిలో వాడీవేడీగా ఎన్నికలు జరగడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

MAA Elections 2021: మా ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించొద్దు.. కృష్ణం  రాజుకు చిరంజీవి లేఖ | Megastar Chiranjeevi Writes Letter to Krishnam Raju  Over MAA Elections 2021

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కోసారి మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సమాయత్తం కావాల్సి ఉంటుంది. మీ మీడియాకు మంచి మెటిరియల్‌ దొరికింది కదా.. ఈ పరిస్థితిలో ఆనంద పడాలి కదా. అని చమత్కరించారు. ఎక్కువ శాతం కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికే నా మద్ధతు అని మెగ‌స్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.

అలాగే మాట్లాడుతూ.. “ఎవరు బాగా ఇండస్ట్రీకి మేలు చేస్తారో వాళ్లకే ఓటు వేశా. రెండు ప్యానెల్స్‌ ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్లు కనిపించారు. ఇరు ప్యానెల్స్‌లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశా. ఏదైనా అధ్యక్షులుగా నిలబడిన ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ఇద్దరూ ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు, చేసేవాళ్లే. రేపు షూటింగ్స్‌లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం.

Balakrishna makes sensational remarks on MAA controversies - News - IndiaGlitz.com

మా సభ్యులకు ఎలాంటి అవసరాలున్నావారికి సహాయం అందించే బాధ్యత మా ఎన్నికల్లో గెలిచిన వారిదే బాధ్యత కాదని, ఇండస్ట్రీలోని అందరిపై ఆ బాధ్యత ఉందని , ‘మా’ అంతిమ లక్ష్యం నటీనటుల సంక్షేమం. ఎవరు గెలిచినా వారు వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం” అని బాలయ్య చెప్పుకొచ్చారు.

Related posts