telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేజీఎఫ్-2 : 29న అధీరా క్రూరత్వం… సంజయ్ దత్ బర్త్ డే కానుక

KGF2

2018లో విడుదలైన “కేజీఎఫ్” సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అక్రమ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రస్తుతం “కేజీఎఫ్ 2” రానుంది. ఇందులో కూడా ప్రధాన పాత్రలో యశ్, హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు. గత ఏడాది జూలై 29న సంజయ్ బర్త్‌డే సందర్భంగా అధీరా పాత్రకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈనెల 29న సంజయ్ దత్ బర్త్ డే సందర్బంగా చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ ను ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. ఈ రోజు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. “ఈనెల 29 న ఉదయం 10 గంటలకు మీకు క్రూరత్వాన్ని చూపిస్తాము” అని ఓ పోస్టర్ విడుదల చేసింది. మొదటి భాగాన్ని నిర్మించిన హోమబుల్ ఫిలిమ్స్ ఈ భాగాన్ని కూడా నిర్మిస్తుంది.

Related posts