telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగశౌర్య 20వ సినిమా ఫస్ట్ లుక్… 6 ప్యాక్ తో విల్లును గురిపెట్టి…!

NS20

యంగ్ హీరో నాగశౌర్య ఈ ఏడాది ‘అశ్వథ్థామ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే తర్వాత కరోనా లాక్ డౌన్ పడటంతో తన తర్వాత సినిమాకు సంబంధించిన అప్డేట్ ను కాస్త ఆలస్యంగా వెల్లడించారు. రెండు రోజుల క్రితం తాను ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా తో వస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు నాగశౌర్య. నాగశౌర్య కెరీర్‌లో 20వ సినిమాగా వస్తున్న దీనిని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల నాగశౌర్య సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసాడు. అందులో 6 ప్యాక్ తో చొక్కా విప్పి విల్లు ఎక్కుపెట్టి చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు శౌర్య. అయితే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అని ముందే చెప్పినట్లుగా… ఈ సినిమాలో నాగశౌర్య ‘ఆర్చర్’ గా కనిపించనునట్లు అర్ధమవుతుంది.

Related posts