వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ విరుచుకుపడ్డారు. వర్మను కుటుంబం ఎప్పుడో వెలివేసిందని, ప్రజలు సైతం బహిష్కరించారని తెలిపారు. సినిమాల్లేక ఎవరో డబ్బులు ఇస్తే అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా చేశాడని ఆరోపించారు. ఇలాంటి పిచ్చి సినిమాలు చేయడం ఆపేయాలని వర్మకు హితవు పలికారు.ఈ సినిమా ద్వారా కులాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేశాడని అన్నారు.
ఈ సినిమాలో తన సీన్లను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే దైవ ప్రార్థనలు, చట్టం సహకారంతో ఆ సీన్లను లేకుండా చేశామని అన్నారు. ఇప్పుడా సినిమా ఫ్లాప్ కావడంతో గర్వం తగ్గిందని విమర్శించారు. తన ఫొటో మార్ఫింగ్ చేయడంపై స్పందిస్తూ, సత్యమే విజయం సాధించిందని తెలిపారు. ఇలాంటి చవకబాబరు ప్రచారం మానుకుని తనకు, దేవుడికి, ప్రజలకు వర్మ క్షమాపణలు చెబితేనే మళ్లీ సక్సెస్ అవుతాడని కేఏ పాల్ పేర్కొన్నారు.