ప్రముఖ సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి 8.50ని.ల సమయంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన గుండెకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకి గుండెపోటు రావడంతో బెంగళూరులో ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కందేపి మృతికి తెలుగు, తమిళ పరిశ్రమలకి సంబంధించిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సత్యనారాయణ ‘పాండురంగ మహత్యం’ అనే తొలి డబ్బింగ్ సినిమా రూపొందించారు. ఆ తర్వాత కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయామోహిని, దొరగారింట్లో దొంగోడు వంటి చిత్రాలని నిర్మించారు. మొత్తం 40 చిత్రాలకు పైగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
Senior Producer Kandepi Satyanarayana garu is no more. Passed away around 8:50 PM on Sunday due to sudden cardiac arrest at Bangalore.
His First dubbing film is pandurangamahathyam & over all 40 films in Tamil
Kongumudi. Sreevaru, sakkanodu, Mayamohini are some of his films. pic.twitter.com/Qr68kzFTUj
— BARaju (@baraju_SuperHit) July 27, 2020