telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొత్త రకం కరోనా వైరస్ పై మంత్రి ఈటల…

కొత్త రకం కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్నచర్యలపై వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు యూకే నుండి, యూకే మీదుగా తెలంగాణకు 1200 మంది వచ్చారని తెలిపారు.. అయితే, వీరిలో ఇప్పటికే 846 మందిని గుర్తించినట్టు వెల్లడించారు.. అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి పాజిటివ్‌గా తేలిందన్న మంత్రి.. కానీ, అది కోవిడా? లేక కొత్త రకం వైరసా? అని నిర్ధారించుకోవడానికి వారికి శాంపిల్స్ హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాక్‌కు వైద్యశాఖ అధికారులు పంపించారని తెలిపారు. మరోవైపు.. పాజిటివ్ వచ్చిన వారు.. కలిసిన వారందరినీ కూడా ట్రేసింగ్ చేస్తున్నామని.. నెగెటివ్ వచ్చిన వారిని సైతం మానిటరింగ్ చేస్తున్నామని వెల్లడించారు. యూకే నుంచి వచ్చిన వాళ్లలో హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, మేడ్చల్, జగిత్యాలలలో పాజిటివ్ కేసులు నమొదు  అయ్యాయి.. ఇప్పటి వరకు ఏడుగురికి పాజిటివ్‌గా తేలగా.. జిన్ మ్యాపింగ్ రిపోర్ట్ రావటానికి మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts