telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్రికెట్ స్టేడియంలో విరాట్ కు అనుష్క ముద్దు… వీడియో వైరల్

Anushka

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ తాజాగా ఢిల్లీలో జ‌రిగిన ఓ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఫిరోజ్ షా కోట్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మైదానంగా మార్చారు. అంతేకాక ఓ స్టాండ్‌కి విరాట్ కోహ్లీ పేరుని పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఈవెంట్ లో డీడీసీఏ అధ్యక్షుడు కోహ్లీ గురించి అర్జున్ జైట్లీ చెప్పిన కొన్ని మాటలను గుర్తు చేసుకున్నారు. విరాట్ తన తండ్రి మరణించిన సమయంలో కూడా దేశం కోసం ఆడడానికి వెళ్లినట్లు అర్జు జైట్లీ చెబుతుండేవారని అంతే కాకుండా కోహ్లీ కంటే గొప్ప ఆటగాడు వరల్డ్ లోనే లేడని కూడా అంటుండేవారని రజత్ శర్మ మాట్లాడారు. ఆ సంద‌ర్భంలో విరాట్ ప‌క్క‌న కూర్చున్న అనుష్క అత‌ని చేతిని ముద్దాడి చాలా ఎమోష‌న‌ల్ అయింది. ఆ స‌మ‌యంలో విరాట్ కూడా భావోద్వేగానికి గురై అనుష్క చేతిని గట్టిగా ప‌ట్టుకున్నాడు. ఈ స‌న్నివేశం కెమెరాల‌లో రికార్డ్ కాగా, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. విరాట్ కోహ్లీ ఈ నెల 15 నుండి ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న సిరీస్ కోసం సిద్ధం అవుతున్నాడు. ఇక అనుష్క జీరో సినిమా త‌ర్వాత ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయ‌క‌పోగా, త‌న భ‌ర్త‌తో క‌లిసి ఆనంద క్ష‌ణాలు గడుపుతుంది.

Related posts