telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాలీవుడ్ సినిమాల్లో ప్రభాస్, అనుష్క…!

prabhas-and-anushka

“బాహుబలి” తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది. కళ్లు చెదిరే విజువల్స్‌తో, అద్భుతమైన కథతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన `బాహుబలి` సినిమాలు భారత్‌లోనే కాకుండా పలు ఇతర దేశాల్లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇటీవల “బాహుబలి-ది బిగినింగ్‌” చిత్రాన్ని లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళితోపాటు ప్రభాస్‌, రానా, అనుష్క, కీరవాణి, శోభూ యార్లగడ్డ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో హాలీవుడ్ సినిమాల‌లో న‌టించ‌డంపై స్పందించారు. మంచి స్క్రిప్ట్ దొరికితే హాలీవుడ్ సినిమాల‌లో న‌టించేందుకు ఎల్ల‌ప్పుడు రెడీ అని ప్ర‌భాస్ అన్నారు. ఇక అనుష్క మాట్లాడుతూ.. భాష‌తో నాకు సంబంధం లేదు. న‌టించ‌డ‌మే నా పని. దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమాల‌లో న‌టించాల‌ని అనుకుంటున్నాను అని స్ప‌ష్టం చేసింది. బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టులు ప్ర‌భాస్‌, అనుష్క‌శెట్టి. వీరిద్ద‌రి గురించి ఏ వార్త వచ్చిన అది హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆ మ‌ధ్య ప్ర‌భాస్, అనుష్క‌లు పెళ్లి చేసుకోనున్నార‌ని జోరుగా ప్ర‌చారం చేశారు. దీనిపై స్పందించిన ప్ర‌భాస్ అవ‌న్నీ పుకార్లు అని కొట్టి పారేశారు.

Related posts