telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాక్… అఘోరీగా మారిన శ్రీరెడ్డి…!!

Srireddy

వివాదాస్పద నటి శ్రీరెడ్డి అఘోరీగా మారి షాకిచ్చింది. మెడలో భారీగా రుద్రాక్ష మాలలు ధరించింది. ఒళ్లంతా బూడిద పూసుకుంది. ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో కర్ర పట్టుకుని నాట్యం చేయడం మొదలుపెట్టింది. మరో ఇద్దరు అఘోర వేషగాళ్లతో కలిసి చేసిన ఈ డ్యాన్స్‌ను టిక్ టాక్ వీడియో చేసింది. అయితే ఇదంతా మహాశివరాత్రి స్పెషల్ అన్నమాట. టిక్ టాక్‌లో తన ఫాలోవర్ల కోసం శ్రీరెడ్డి చేసిన శివరాత్రి వీడియో ఇది. నిజానికి ఈ వీడియోలో శ్రీరెడ్డి చాలా భయంకరంగా కనిపిస్తోంది. నుదిటిన పసుపు, దానిపై పెద్ద బొట్టు, విభూది చూసి ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి శివరాత్రి నాడు కూడా ఫ్యాన్స్‌కు వినోదం పంచుతోంది శ్రీరెడ్డి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts