telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ గారాల పట్టి సితార… కరోనా టిప్స్

Sitara

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్‌డౌన్ పేరుతో ఎవరినీ బయటకు రానీయకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు. కాగా.. అటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు, క్రీడాకారులు కూడా కరోనాకు సంబంధించి పలు సూచనలు, సలహాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా కరోనాను కట్టడి చేయడానికి.. ప్రజలకు తన వంతుగా పలు టిప్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్లుగా వైరల్ అవుతోంది.

వీడియోలో సితార టిప్స్:

1. కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండండి
2. మేము కూడా సేఫ్‌గా ఇంట్లోనే ఉన్నాం
3. బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్‌ వేసుకోండి
4. జ్వరం, పొడి దగ్గు, మోషన్స్, జలుబు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి
5. ఇంట్లో ఉన్నా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి
6. అలాగే శానిటైజర్‌తో 22 సెకండ్లపాటు చేతులను కడుక్కోవాలి
7. ఏ వస్తువును ముట్టుకున్నా లేక ఇంట్లో ఏ వర్క్ చేసిన తర్వాత ఖచ్చితంగా మోచేతుల వరకూ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి
8. అలాగే మీరు దగ్గినా.. తుమ్మినా.. అరిచేతుల్లోకి కాకుండా మోచేతిని అడ్డం పెట్టుకోండి
9. దయచేసి చేతులతో మీ ముఖాన్ని, కళ్లను, పెదాలను ముట్టుకోకండి

Related posts