telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సన్నీ లియోన్ నెంబర్ అడిగిన సీనియర్ హీరో… ఆమె భర్త ఏమన్నాడంటే ?

Sunny

 ఇటీవల ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ క్యాలెండర్ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఏటా సన్నీ ఈ ఫొటో షూట్స్‌లో పాల్గొంటారు. ఈసారి చాలా హాట్‌గా పోజులిచ్చారు. 2020 క్యాలెండర్ కోసం డబూ న్యూడ్ ఫొటోస్ తీయాలనుకున్నారు. ఇందుకోసం సన్నీ తన ముందు పెద్ద పుస్తకం పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చారు. అయితే ఈ ఫొటో షూట్ జరుగుతున్న సమయంలో సన్నీ లియోనీతో పాటు కబీర్ బేడీ కూడా ఉన్నారట. సన్నీ ఫొటో షూట్ కార్యక్రమం పూర్తయ్యాక ఇద్దరూ కాసేపు చర్చించుకున్నారట. ఆ సమయంలో కబీర్ సన్నీని నెంబర్ కావాలని అడిగారట. కబీర్ బేడీకి తన భర్త డేనియల్ వెబర్ నెంబర్ ఇచ్చారనిఇచ్చి షాకిచ్చారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దాంతో కబీర్ బేడీ ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను సన్నీ లియోనీని నెంబర్ అడిగానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కల్పితం. నేను ఆమె భర్త డేనియల్ వెబర్ నెంబర్ అడిగాను. అతను నా ఫోన్ తీసుకుని నెంబర్ సేవ్ చేసి ఇచ్చారు. నా గురించి తప్పుగా రాసారు కాబట్టి ఆ వార్తలన్ని తొలగించి నాకు సారీ చెప్పాలి’’ అని మండిపడ్డారు. ఈ వార్తలపై సన్నీ భర్త కూడా స్పందించారు. ‘‘కబీర్ గారు నా నెంబర్ ఎందుకు అడగకూడదు? ఆయన దగ్గర సన్నీ లియోనీ నెంబర్ ఎప్పటినుంచో ఉంది. వారిద్దరూ ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్స్. వ్యూస్ కోసం ఇలాంటి వార్తలు క్రియేట్ చేసి మరీ రాయాల్సిన పనిలేదు’’ అని క్లారిటీ ఇచ్చారు.

Related posts