telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి ఫోన్ చోరీ చేసిన దొంగలు… !?

Meera-chopra

ప్రముఖ బాలీవుడ్ నటి మీరా చోప్రా మంగళవారం సాయంత్రం తన తండ్రిని బెదిరించిన ఇద్దరు దుండగులు.. ఆయన ఫొన్ ఎత్తుకెళ్లారని ట్వీట్ చేసింది. ఈ విషయంపై ట్వీట్టర్ వేదికగా పోలీసులను ప్రశ్నించింది మీరా చోప్రా. “‘నా తండ్రి బయటికి వెళ్లినప్పుడు.. ఇద్దరు దుండగులు స్కూటర్‌పై వచ్చి కత్తితో బెదిరించి ఫోన్ దోచుకెళ్లారు. ఢిల్లీలోని పోలీస్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఢిల్లీని సురక్షిత ప్రాంతమని ఎలా అనుకోవాలి?” అని ప్రశ్నిస్తూ ఆమె ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని, ఢిల్లీ పోలీసులని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. కాగా ఈ విషయంపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే వారి థ్యాంక్స్ చెబుతూ మీర చోప్రా మరో ట్వీట్ చేశారు. ‘బంగారం, వాన, గ్రీకు వీరుడు’ వంటి తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి మీరా చోప్రా. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు చేస్తోంది. ఇక ఈ బ్యూటీ ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు వరుసకి సోదరి కూడా.

Related posts