టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబును తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి వరించనుందనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై మోహన్ బాబు ట్విటర్ ద్వారా స్పందించారు. తాను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. “నేను టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్టుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కొందరు ఫోన్లు కూడా చేసి అడుగుతున్నారు. నా ఆశయం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడమే. అందుకోసమే నా వంతుగా కష్టపడ్డాను. వైఎస్ జగన్ ప్రజల ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకంతోనే నేను తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించాను. అంతేగాని ఎలాంటి పదవులూ ఆశించి కాదు. ఇలాంటి పుకార్లను ప్రోత్సహించవద్దని మీడియాను కోరుతున్నాను” అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
previous post
next post